టీడీపీకి ముచ్చటగా మూడే: రాయలసీమను ఊడ్చేసిన జగన్

By narsimha lodeFirst Published May 24, 2019, 1:50 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని 52 అసెంబ్లీ స్థానాల్లో  టీడీపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.టీడీపీకి గట్టి పట్టున్న అనంతపురం జిల్లాలో రెండు స్థానాలకే టీడీపీ పరిమితమైంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని 52 అసెంబ్లీ స్థానాల్లో  టీడీపీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.టీడీపీకి గట్టి పట్టున్న అనంతపురం జిల్లాలో రెండు స్థానాలకే టీడీపీ పరిమితమైంది.

రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 52 అసెంబ్లీ స్థానాల్లో  చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహించిన కుప్పం, బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం స్థానాల్లో విజయం సాధించింది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ఫలితాన్ని శుక్రవారం నాడు తెల్లవారుజామున ప్రకటించారు.

శుక్రవారం నాడు తెల్లవారుజామున ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం సాధించినట్టుగా అధికారులు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు నాయుడు కుప్పం మినహా మిగిలిన 13 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మినహా టీడీపీ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. రాఫ్తాడు నుండి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్ కూడ ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుండి పరిటాల సునీత రెండు దఫాలు ప్రాతినిథ్యం వహించారు.

కడప జిల్లాలోని 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకొంది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుండి టీడీపీ ఒక్క స్థానాన్ని గెలిచింది. ఈ  దఫా ఈ ఒక్క స్థానం కూడ దక్కలేదు.కర్నూల్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలో కూడ టీడీపీ విజయం సాధించలేదు.
 

click me!