చంద్రబాబుకు సొంత ఇలాకాలో షాక్: వైసీపీలోకి ఎస్.సి.వీ నాయుడు

By Nagaraju penumalaFirst Published Mar 30, 2019, 5:14 PM IST
Highlights

శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ కీలకనేత ఎస్.సీవీ నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం గూడూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎస్.సీవీ నాయుడుకు మంచి పట్టుంది.


శ్రీకాళహస్తి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీకాళహస్తికి చెందిన టీడీపీ కీలకనేత ఎస్.సీవీ నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఆదివారం గూడూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎస్.సీవీ నాయుడుకు మంచి పట్టుంది.

తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. గతంలో మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బరిలో ఉండేవారు కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చామని ఆయన తప్పుకుంటున్న నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. 

అయితే చంద్రబాబు నాయుడు మాత్రం బొజ్జల సుధీర్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. దీంతో అలిగిన ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. అటు బొజ్జల సుధీర్ రెడ్డి సైతం నేరుగా ఎస్.సీ.వీ నాయుడును కలిశారు. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

మరోవైపు చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత పెద్దిరరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఎస్.సి.వి నాయుడును కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. 

కార్యకర్తలతో ఆలోచించి చెప్తానని వారితో హామీ ఇచ్చారు. ఇటీవలే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఆయన వైసీపీలో చేరబోతున్నారు. ఎస్.సివీ నాయుడు వైసీపీలో చేరుతుండటంతో బొజ్జల సుధీర్ రెడ్డికి కాస్త ఇబ్బందేనని చెప్పుకోవాలి. 

 

click me!