ఏపిలో ఏడుచోట్ల రీపోలింగ్ ప్రారంభం...మరోసారి ఓటేయనున్న 5451మంది ఓటర్లు

By Arun Kumar PFirst Published May 19, 2019, 8:11 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవర్గంలో రీపోలింగ్ మొదలయ్యింది.  ఉదయం ఏడు గంటలకే ఏడు పోలింగ్ బూతుల్లో ఈ రీపొలింగ్ ప్రారంభమయ్యింది. పులివర్తిపల్లి, కుప్పంబాదు, రామచంద్రాపురం, ఎన్‌ఆర్ కమ్మపల్లి, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలేపల్లి గ్రామాల్లో గతంలో అవకతవకలు  జరిగినట్లు ఈసీ గుర్తించింది. దీంతో రీపోలింగ్  ఇవాళ(ఆదివారం) మరోసారి పోలింగ్ జరుపుతున్నారు. 

రీపొలింగ్ జరుగుతున్న ఈ గ్రామాల్లోని ఏడు పోలింగ్ బూతుల్లో దాదాపు ఐదు వేల పైచిలుకు ఓటర్లున్నారు. వీరందరు ఇవాళ రెండోసారి ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 

అయితే ఆ రీపోలింగ్ ను తెలుగు దేశం పార్టీ  వ్యతిరేకించగా,  వైఎస్సార్‌సిపి పార్టీ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈసీ కూడా ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా కట్టుదిట్టమయిన ఏర్పాట్లు చేసింది. 

మరోసారి తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆయా గ్రామాల ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయమే  పోలింగ్ బూతుల వద్దకు చేరుకుని తమ ఓటు  హక్కును వినియోగించుకుంటున్నారు. మద్యాహ్నం ఎండ ప్రభావంతో కాస్త పోలింగ్ కాస్త నెమ్మదించినా ఉదయం, సాయంత్రం జోరుగా సాగనుంది.  
 
click me!