చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి: నామినేషన్ వెయ్యకుండా అజ్ఞాతంలోకి

By Nagaraju penumalaFirst Published Mar 21, 2019, 11:33 AM IST
Highlights

నాకొద్దు ఈ టికెట్ అంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం. టికెట్ కేటాయించి 36 గంటలు గడిచినా తాను పోటీ చేయ్యలేనని తెగేసి చెప్తున్నారు. సీనియర్ నేతలకు సైతం నేరుగా ఫోన్ చేసి తాను పోటీ చెయ్యలేనని చేతులెత్తేశారని తెలుస్తోంది. 
 

చిత్తూరు : అధికార తెలుగుదేశం పార్టీకి మరోతలనొప్పి ఎదురైంది. టికెట్ ఇచ్చినా కొందరు పోటీకి వెనుకడుగువేస్తున్నారు. ఇటీవలే శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాను పోటీ చెయ్యడం లేదని చెప్పి రెండు రోజులు గడవకముందే మరో ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. 

నాకొద్దు ఈ టికెట్ అంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం. టికెట్ కేటాయించి 36 గంటలు గడిచినా తాను పోటీ చేయ్యలేనని తెగేసి చెప్తున్నారు. సీనియర్ నేతలకు సైతం నేరుగా ఫోన్ చేసి తాను పోటీ చెయ్యలేనని చేతులెత్తేశారని తెలుస్తోంది. 

అయినప్పటికీ పార్టీ నుంచి ఒత్తిడులు వస్తున్న నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. రెండు రోజులుగా ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితమే ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని ఆయన వెల్లడించారు. 

ఇకపోతే పూతలపట్టు టీడీపీ అభ్యర్థి విషయంలో మెుదటి నుంచి గందరగోళం ఏర్పడింది. ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్‌ అని మెుదటి జాబితా విడుదలకు ముందు వరకు ప్రచారం జరిగింది. దీంతో ఆమె ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారు. 

నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను చుట్టేస్తున్నారు. అయితే సోమవారం రాత్రి టీడీపీ అభ్యర్థిగా తెర్లాం పూర్ణం ను ప్రకటించింది టీడీపీ. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తీరా టికెట్ దక్కించుకున్న పూర్ణం తాను పోటీ చేసేది లేదంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

నామినేషన్ల పర్వం ఊపందుకున్న నేపథ్యంలో ఆయన ఎక్కడ ఉన్నారా అని తెలుసుకునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ. ఇకపోతే పూతలపట్టు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎంఎస్ బాబు బరిలో ఉన్నారు.  

click me!