ప్రశాంత్ కిశోర్ ట్వీట్ దుమారం: నితీష్ పై అసంతృప్తి, జగన్ కోసమేనా...

By telugu teamFirst Published Mar 30, 2019, 10:39 AM IST
Highlights

బీహార్ ముఖ్యమంత్రి, జెడియు నేత నితీష్ కుమార్ పై అసంతృప్తితో ప్రశాంత్ కిశోర్ తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు ప్రచారం సాగుతోంది. బీహార్‌లోని మహాకూటమి నుండి సీఎం నితీష్ వైదొలిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

అమరావతి: ఎన్నికల వ్యూహకర్త నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకోవడంపై దుమారం చెలరేగుతోంది. ఆయన జెడియు నిర్వహణ, ప్రచార బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

ఆ విషయాన్ని మార్చి 29వ తేదీ శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. జేడీయూ నేత రాజ్యసభ సభ్యుడు రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ ఈ బాధ్యతలను చూస్తారని ఆయన చెప్పారు. ఆయన ఎందుకు వైదొలిగారనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. 

2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి నుండి ఎన్నికల వ్యూహకర్తగా మంచి సంపాదించుకున్నారు. రాజకీయ జీవితం ప్రారంభించిన తాను ప్రస్తుతం నేర్చుకోవడానికి, సహకరించడానికే పరిమితమవుతానని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

బీహార్ ముఖ్యమంత్రి, జెడియు నేత నితీష్ కుమార్ పై అసంతృప్తితో ప్రశాంత్ కిశోర్ తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు ప్రచారం సాగుతోంది. బీహార్‌లోని మహాకూటమి నుండి సీఎం నితీష్ వైదొలిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మహాకూటమి నుండి బయటకు వచ్చిన తరువాత ప్రజాతీర్పును వెళితే బాగుండేదని ఇటీవలే ప్రశాంత్ వ్యాఖ్యానించారు. దీనిపై జేడీఎస్‌లో దుమారం చెలరేగింది. 

ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పని ముగిసిన తర్వాత ఆయన మహారాష్ట్రలో శివసేన కోసం పనిచేయడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. 

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చెప్పడం వల్ల తాను ప్రశాంత్ కిశోర్ ను తీసుకున్నానని, అయితే ఆయనకు రాజకీయానుభవం లేదని, అంత బాగా పనిచేయడం లేదని నితీష్ కుమార్ జనవరిలో వ్యాఖ్యానించారు. 

click me!