పవన్ కళ్యాణ్ నామినేషన్ కు అంతా సిద్ధం: ముహూర్తం ఇదే....

Published : Mar 19, 2019, 09:06 PM IST
పవన్ కళ్యాణ్ నామినేషన్ కు అంతా సిద్ధం: ముహూర్తం ఇదే....

సారాంశం

అయితే నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కావడంతో నామినేషన్లు వేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 21న విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు పవన్ కళ్యాణ్. 21 ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట మధ్య నామినేషన్ దాఖలు చెయ్యనున్నట్లు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 

అయితే నామినేషన్ల ప్రక్రియ వేగవంతం కావడంతో నామినేషన్లు వేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 21న విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు పవన్ కళ్యాణ్. 

21 ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట మధ్య నామినేషన్ దాఖలు చెయ్యనున్నట్లు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆ మరుసటి రోజు అంటే మార్చి22న మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటలలోపు పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.   

 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు