మా అన్నయ్యనే అరె ఒరే అంటావా నువ్వేమైనా దిగొచ్చావా: పవన్ తీవ్ర వ్యాఖ్యలు

Published : Apr 08, 2019, 06:18 PM IST
మా అన్నయ్యనే అరె ఒరే అంటావా నువ్వేమైనా దిగొచ్చావా: పవన్ తీవ్ర వ్యాఖ్యలు

సారాంశం

తిరుపతిలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కారు దిగుతుంటే అరె దిగొద్దు, నువ్వు ఎవడవు ఇక్కడ దిగడానికి అంటూ అరె ఒరే అన్నారని ఆరోపించారు. అన్నయ్య చిరంజీవిని అరె ఒరే అంటున్నారంటూ గుర్తు చేశారు. ఏ కరుణాకర్ రెడ్డి నువ్వేమైనా పై నుంచి దిగొచ్చావా అంటూ మండిపడ్డారు.   

కాకినాడ: తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిపై దుండగుడిలా ప్రవర్తించాడని ఆరోపించారు. 

తిరుపతిలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కారు దిగుతుంటే అరె దిగొద్దు, నువ్వు ఎవడవు ఇక్కడ దిగడానికి అంటూ అరె ఒరే అన్నారని ఆరోపించారు. అన్నయ్య చిరంజీవిని అరె ఒరే అంటున్నారంటూ గుర్తు చేశారు. ఏ కరుణాకర్ రెడ్డి నువ్వేమైనా పై నుంచి దిగొచ్చావా అంటూ మండిపడ్డారు. 

తన సోదరుడు చిరంజీవి, తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే తట్టుకోలేని వారని విరుచుకుపడ్డారు. కడుపు మంటతో తమపై పడి ఏడుస్తున్నారని విమర్శించారు. దుండుగులు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.  
 
PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు