ఎన్టీఆర్‌తో నేనేప్పుడు పోల్చుకోలేను: పవన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 14, 2019, 6:33 PM IST
Highlights

టీచర్ అవ్వాలంటే టీచర్ ట్రైనింగ్, ఐపీఎస్ అవ్వాలంటే ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకోవాలని.. కానీ దురదృష్టం కొద్దీ రాజకీయాలకు మాత్రం డబ్బులుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోవచ్చని పవన్ దుయ్యబట్టారు. 


టీచర్ అవ్వాలంటే టీచర్ ట్రైనింగ్, ఐపీఎస్ అవ్వాలంటే ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకోవాలని.. కానీ దురదృష్టం కొద్దీ రాజకీయాలకు మాత్రం డబ్బులుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోవచ్చని పవన్ దుయ్యబట్టారు.

నెల్లూరులో చదువుతున్నప్పుడు మా స్నేహితుడిని ఆంధ్రా వాడివని తెలంగాణలో కొట్టి పంపించేశారని పవన్ గుర్తు చేసుకున్నారు. కొన్ని దశాబ్ధాల తర్వాత రాష్ట్రాన్ని ఆ ఫీలింగ్ రాష్ట్రాన్ని విడదీసిందన్నారు.

రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో 2014లో జనసేన పార్టీని స్థాపించానన్నారు. ఆ రోజు సభలో నేను ఏమైనా తప్పు మాట్లాడితే కొట్టాలని చూశారని, అయితే తాను అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తినని పవన్ తెలిపారు.

సత్యమేవ జయతే అన్నది భారతదేశ నినాదమన్నారు. ఒక సత్యాన్ని నమ్మి ఏం ఆశించకుండా టీడీపీకి, బీజేపీకి మద్ధతిచ్చానని పవన్ గుర్తు చేశారు. డబ్బు తనకు ఆనందం ఇవ్వలేదని ఒక మనిషికి అన్యాయం జరుగుతున్నప్పుడు పార్టీ పెట్టి మంచి కోసం నిలబడ్డానని జనసేనాని స్పష్టం చేశారు.

నీకు డబ్బు లేదు, నీ వెనుక ఉన్న కుర్రాళ్లు టీనేజర్లని వీళ్లంతా రేపు నిన్ను ఎలా గెలిపిస్తారని ఎలా గెలుస్తావంటూ తనను హేళన చేశారన్నారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు తాను ఒక్కడినేనని, కానీ ఇప్పుడు తన వెనక సైన్యముందని పవన్ గుర్తు చేశారు.

ఎన్టీఆర్ 60 ఏళ్లు దాటినప్పుడు రాజకీయాల్లోకి వచ్చారని, మనవళ్లు పుట్టిన తర్వాత, జీవితాన్నంతా చూసి రామారావు ఎంట్రీ ఇచ్చారన్నారు. నాడు మార్పు రావాలని జనం కోరుకున్నప్పుడు ఎన్టీఆర్ దూసుకొచ్చారని జనసేనాని గుర్తు చేశారు. ఆయనతో తానెప్పుడూ పోల్చుకోలేనని పవన్ తెలిపారు. 

click me!