అన్నింటికి సిద్దపడే వచ్చా: జగన్‌కు పవన్ అభినందనలు

Published : May 23, 2019, 08:36 PM IST
అన్నింటికి సిద్దపడే వచ్చా: జగన్‌కు పవన్ అభినందనలు

సారాంశం

జనసేనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు.  

అమరావతి: జనసేనకు ఓటేసిన ప్రతి ఒక్కరికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను పోరాటం చేస్తానని
ఆయన ప్రకటించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత గురువారం నాడు రాత్రి  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన జనసేన కార్యకర్తలకు ఆయన కూడ ధన్యవాదాలు తెలిపారు.

ఏపీలో అధికారం చేపట్టనున్న వైసీపీ చీఫ్ జగన్‌కు,  దేశంలో అధికారాన్ని చేపట్టనున్న మోడీకి ఆయన అభినందనలు తెలిపారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

25 ఏళ్ల పాటు పార్టీని నడుపుతానని ప్రకటించినట్టుగానే పార్టీని నడుపుతానని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను ఇచ్చి మాటను నిలుపుకోవాలని ఆయన పాలకులను కోరారు.

డబ్బులు, మద్యం వంటి వాటికి దూరంగా జనసేన ఉందని ఆయన చెప్పారు. ప్రజాసమస్యలపై తాను రాజీలేని పోరాటం నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు