టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు

By Nagaraju penumalaFirst Published Mar 9, 2019, 8:34 PM IST
Highlights

గౌరు చరితారెడ్డి దంపతులను చంద్రబాబు నాయుడు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా ప్రజలకు తాగునీటిని అందించడానికి గుండ్లేరుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు.

అమరావతి: పాణ్యం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె భర్త గౌరు వెంకటరెడ్డితో కలిసి టీడీపీ కండువా కప్పుకున్నారు. 

గౌరు చరితారెడ్డి దంపతులను చంద్రబాబు నాయుడు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా ప్రజలకు తాగునీటిని అందించడానికి గుండ్లేరుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్‌ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆమె కొనియాడారు.

 అలాగే ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని ఆమె చంద్రబాబు నాయుడును కోరారు. కర్నూలు జిల్లాకు కొంతమంది కుట్రతో తాగునీరు అందకుండా అడ్డుపడితే చంద్రబాబు నాయుడు వాటిని చేధించి ప్రజలకు తాగు, సాగునీరు అందించారని తెలిపారు. గుండ్లేరు ప్రాజెక్టు ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి.
 
click me!