క్యాబినెట్ భేటీ: చంద్రబాబుకు పరీక్ష, అధికారులు డుమ్మా?

By telugu teamFirst Published May 7, 2019, 10:15 AM IST
Highlights

ఈసిపై పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అధికారులు లేకుండా తన మంత్రివర్గ సభ్యులతోనే సమావేశం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చునని అంటున్నారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి అధికారులు హాజరవుతారా, లేదా అనే సందేహం ఏర్పడింది. అది ఒకరకంగా చంద్రబాబుకు పరీక్షనే. చంద్రబాబు ఏర్పాటు చేసే మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి అధికారులకు ఎన్నికల కమిషన్ (ఈసి) అనుమతి ఇస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

ఈసిపై పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అధికారులు లేకుండా తన మంత్రివర్గ సభ్యులతోనే సమావేశం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చునని అంటున్నారు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సమాచారం అందాల్సి ఉంటుంది. తగిన సమాచారంతో మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలని ఆదేశిస్తూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ నోట్ సర్క్యులేట్ చేస్తారు. 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున మంత్రివర్గ సమావేశానికి హాజరు కావాలా, వద్దా అనే విషయాన్ని ఎల్బీ సుబ్రహ్మణ్యం ఈసీని అడిగే అవకాశం ఉంది. అందుకు సంబంధించి నోట్ సర్క్యులేట్ చేయడానికి కూడా ఆయన ఈసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

 ఈసి అనుమతి ఇస్తే అధికారులు మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే వారు హాజరు కారు. ఫణి తుఫానుపై సమీక్షకు ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కాకపోవడంపై చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు రిపోర్టు చేయాల్సిందేనని ఆయన అంటున్నారు. 

ముఖ్యమంత్రి, మంత్రులు సుప్రీం అని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవలం పెసిలిటేటర్ మాత్రమేనని, అవసరమైనప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశానికి హాజరు కావాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. 

click me!