జగన్‌‌ను ‘మూడు’ ఆదుకుందా: సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

Siva Kodati |  
Published : May 24, 2019, 09:25 AM ISTUpdated : May 24, 2019, 09:29 AM IST
జగన్‌‌ను ‘మూడు’ ఆదుకుందా: సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

సారాంశం

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఘన విజయం సాధించడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక జగన్ విజయానికి దారి తీసిన అంశాలపై సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

ముఖ్యంగా న్యూమరాలజీని గురించిన ఒక పోస్ట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి అదృష్ట సంఖ్య 3.. పులివెందులలో ఆయనకు లభించిన 90,543 ఓట్ల ఆధిక్యత వచ్చింది.

ఈ సంఖ్యలో చివరిలో 3 నంబర్ ఉండటమే కాకుండా ఆ అంకెలను కూడినా 3వ సంఖ్య రావడం గమనార్హం. అలాగే ఇప్పటి వరకు ఆయన సీఎం పదవిని మూడు సార్లు ఆశించగా.. ముచ్చటగా మూడోసారి జగన్‌ను పదవి వరించింది.

ఇక డిసెంబర్ 21 జగన్ పుట్టినరోజు... ఇందులో కూడా మొత్తం సంఖ్య 3 వస్తుంది. మార్చి 12 జగన్‌ వైసీపీని స్థాపించారు.. ఆ నెల మూడో నెల.. పార్టీ జెండాలో రంగులు, ఫ్యాన్ రెక్కలు కూడా మూడే కావడం విశేషం.
 
PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు