అంకుల్ బాగున్నారా? వైసీపీ నేతతో రామ్మోహన్ నాయుడు

Published : Apr 12, 2019, 02:07 PM IST
అంకుల్ బాగున్నారా? వైసీపీ నేతతో రామ్మోహన్ నాయుడు

సారాంశం

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ శుక్రవారం తో ముగిసింది. నిన్న, మొన్నటి వరకు ఒక పార్టీ నేతలను.... మరో పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. 

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ శుక్రవారం తో ముగిసింది. నిన్న, మొన్నటి వరకు ఒక పార్టీ నేతలను.... మరో పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. కాగా.. ఇప్పుడు పోలింగ్ ముగిసి ప్రశాంతంగా ఉంది. ఫలితాలు విడుదల కావడానికి ఇంకా నెలన్నర సమయం ఉంది. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. తమ ప్రత్యర్థిపార్టీ నేత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

గురువారం ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించేందుకు టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌, ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతా రాంలు ఒకేసారి వచ్చారు.
 
వారితో పాటు రెండు పార్టీల కార్యకర్తలూ అక్కడకు చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వెడేక్కింది. ఇంతలో రామ్మోహన్‌నాయుడు.. సీతారాంను చూసి అంకుల్‌ బాగున్నారా అని చిరునవ్వుతో పలకరించారు. దీంతో ఆయన కూడా రామ్‌ బాగున్నావా అని భుజం తట్టడంతో రాజకీయ వేడి చల్లబడింది.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు