చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు: అధికారులపై క్రిమినల్ కేసు

By narsimha lodeFirst Published Apr 19, 2019, 11:55 AM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఈసీ వేటేసింది. అంతేకాదు వీరిద్దరిపై కూడ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
 

మండపేట: తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఈసీ వేటేసింది. అంతేకాదు వీరిద్దరిపై కూడ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

తూర్పు గోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మారేడుబాక గ్రామంలోని 108 పోలింగ్ బూత్‌కు చెందిన వీవీప్యాట్ స్లిప్పులు, ఓటరు స్లిప్పులు చెత్త కుప్పలో దొరికాయి. దీంతో  బీజేపీ అభ్యర్ధి అయ్యాజీ వేమా  ఈ విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

మారేడుబాకలోని 108 పోలింగ్‌బూత్‌కు చెందిన వీవీప్యాట్‌స్లిప్పులు, ఓటరు స్లిప్పులు చెత్త కుప్పలో దొరికిన ఘటనపై రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు సీరియస్ అయ్యారు. ఈ పోలింగ్ బూత్‌లో విధుల్లో ఉన్న ప్రిసైడింగ్ అధికారి గంట లత, ఏపీఓలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు వీరిద్దరిపై మండపేట పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.

click me!