జగన్ కి షాక్.. వైసీపీలో రెబల్ గా మహిళానేత

By ramya NFirst Published Mar 18, 2019, 12:57 PM IST
Highlights

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే కీలక పార్టీలన్నీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకంటించేశాయి. 

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే కీలక పార్టీలన్నీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకంటించేశాయి. అయితే.. టికెట్ ఆశించి భంగపడిన పలువురు రెబల్స్ గా రంగంలోకి దిగేందుకు సిద్ధమౌతున్నారు. ఈ రెబల్స్ పోరు వైసీపీకి కూడా తప్పేలా లేదు. టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదనే కారణంతో రెబల్ గా పోటీ దిగడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కోడి సుజాత స్పష్టం చేశారు. 

రంపచోడవరం నియోజకవర్గం బరిలో తాను వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు. ఎటపాక మండలం రాజుపేటకు చెందని సుజాత ఏడాది క్రితం వైసీపీలో చేరి పార్టీ కార్యకరమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని మొదట ఆమెకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. దీంతో.. ఆమె పార్టీ కోసం కృషి చేయడం మొదలుపెట్టారు. తీరా ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందింది. తనకు కోయ తెగ మద్దతు ఉందని..అలాంటి తనను కాదని.. ధనలక్ష్మికి టికెట్ ఇచ్చారని మండిపడింది. 

 రంపచోడవరం నియోజకవర్గంలో ఆదివాసీల్లో మెజారిటీగా ఉన్న కోయతెగకు అన్యాయం జరిగిందని కోడి సుజాత తెలిపారు. లక్ష ఓట్లకు పైచిలుకు కోయ తెగ ఓట్లు ఉన్నా స్వల్ప ఓట్లు ఉన్న ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తికి వైసీపీ టికెట్‌ కేటాయించడం విడ్డూరన్నారు. ఈ విషయంలో పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు అధినాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారంటూ ఆరోపించారు. వైఎస్సార్‌ అభిమానిగా ఉన్న తమ కుటుంబం వైసీపీని వీడేదిలేదని, రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు.
 

click me!