అదంతా కేంద్రం కుట్రలో భాగం.. కోడెల కామెంట్స్

Published : Apr 15, 2019, 12:27 PM IST
అదంతా కేంద్రం కుట్రలో భాగం.. కోడెల కామెంట్స్

సారాంశం

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. 

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన గుంటూరు లో మీడియాతో మాట్లాడారు. కచ్చితంగా తమ పార్టీకి 130 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోలింగ్‌కు తక్కువ బలగాలు పంపడం కేంద్రం కుట్రలో భాగమేనని విమర్శించారు. టీడీపీపై మోదీ, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. 

చంద్రబాబుకు సంక్షేమం, అమరావతి, పోలవరం అజెండాగా ఉందన్నారు. జగన్‌కు మాత్రం సీఎం అవ్వడం ఒక్కటే అజెండా అని ఎద్దేవా చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల సంగతి చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు