మరో జాబితాను విడుదల చేసిన జనసేన: వైఎస్ జగన్, బాలయ్యలపై పోటీ చేసేది వీరే......

Published : Mar 23, 2019, 07:35 AM IST
మరో జాబితాను విడుదల చేసిన జనసేన: వైఎస్ జగన్, బాలయ్యలపై పోటీ చేసేది వీరే......

సారాంశం

కడప జిల్లా వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైన పులివెందులకు అభ్యర్థిని ప్రకటించారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా తుపాకుల చంద్రశేఖర్ ను ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంకు కూడా అభ్యర్థిని ప్రకటించారు పవన్. ఆకుల ఉమేశ్ ను హిందూపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  

విజయవాడ: జనసేన పార్టీ మరో జాబితా విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ఇప్పటికే పలు దఫాలుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 

తాజాగా శుక్రవారం రాత్రి మరో జాబితా విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లోని 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో అత్యధికంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. 

అలాగే కడప జిల్లా వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమైన పులివెందులకు అభ్యర్థిని ప్రకటించారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా తుపాకుల చంద్రశేఖర్ ను ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంకు కూడా అభ్యర్థిని ప్రకటించారు పవన్. ఆకుల ఉమేశ్ ను హిందూపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  

అభ్యర్థుల వివరాలు 
 కృష్ణా జిల్లా:
1. గుడివాడ- వీఎస్ వీ. రఘునందనరావు 
2. జగ్గయ్యపేట- ధరణికోట వెంకటరమణ 

  గుంటూరు జిల్లా:
3. పొన్నూరు -బోని పార్వతీనాయుడు 
4. గురజాల-చింతలపూడి శ్రీనివాస్‌ 

 కర్నూలు జిల్లా:
5. నంద్యాల-సజ్జల శ్రీధర్‌రెడ్డి 
6. మంత్రాలయం-బోయ లక్ష్మణ్‌ 

 అనంతపురం జిల్లా:
7. రాయదుర్గం-కె.మంజునాథ్‌ గౌడ్‌ 
8. తాడిపత్రి-కదిరి శ్రీకాంత్‌రెడ్డి 
9. కళ్యాణదుర్గం-కరణం రాహుల్‌ 
10. రాప్తాడు-సాకే పవన్‌కుమార్‌ 
11. హిందూపురం-ఆకుల ఉమేశ్‌ 

 కడప జిల్లా:
12. పులివెందుల- తుపాకుల చంద్రశేఖర్‌ 

 నెల్లూరు జిల్లా:
13.  ఉదయగిరి-మారెళ్ల గురుప్రసాద్‌ 
14. సుళ్లూరుపేట-ఉయ్యాల ప్రవీణ్‌ 

చిత్తూరు జిల్లా:
15. పీలేరు -బి.దినేశ్‌ 
16. చంద్రగిరి- శెట్టి సురేంద్ర 

 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు