
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు.
చంద్రబాబును జీవీఎల్ విశ్రాంత సిఎంగా అభివర్ణించారు. ఇంతకు ముందు ఢిల్లీకి రాజకీయాల కోసం వెళ్లి రూ. 2 కోట్ల ప్రజల సొమ్మును వృధా చేశారని ఆయన అన్నారు "విశ్రాంత సిఎం చంద్రబాబు గారూ... ప్రజాధన దుర్వినియోగాన్ని ఆపాలి" అని ఆయన కోరారు.
"మీరు టీడీపి అధ్యక్షుడి హోదాలో వెళ్లారు. మీ పార్టీ నిదుల్ని వెచ్చించాలి. ప్రజాధాన్ని వాడితే మీ నుంచి, అధికారుల నుంచి వసూలు చేయాలి" అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తన వ్యాఖ్యలను చంద్రబాబుకు ట్యాగ్ కూడా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరును తప్పుపడుతున్న చంద్రబాబు ఆ విషయంపై సీఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.