వైసీపీలోకి మాజీ మంత్రి: జగన్‌తో డీఎల్ రవీంద్రారెడ్డి భేటీ

By narsimha lodeFirst Published Mar 14, 2019, 7:45 PM IST
Highlights

 మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గురువారం రాత్రి వైసీపీ వైఎస్ జగన్‌‌ను కలిశారు.  వైసీపీలోకి డీఎల్ రవీంద్రారెడ్డి  చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

హైదరాబాద్:  మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి గురువారం రాత్రి వైసీపీ వైఎస్ జగన్‌‌ను కలిశారు.  వైసీపీలోకి డీఎల్ రవీంద్రారెడ్డి  చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

2014 ఎన్నికల సమయంలో డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు.  కానీ టిక్కెట్టు కేటాయింపు విషయమై బాబు నుండి స్పష్టమైన హామీ ఆయనకు లభించలేదు. దీంతో డీఎల్ రవీంద్రారెడ్డి తటస్థంగానే ఉన్నారు.

కొంత కాలంగా టీడీపీ, వైసీపీల నుండి డీఎల్‌ రవీంద్రారెడ్డికి ఆఫర్లు వచ్చాయి. నెల రోజుల క్రితం డీఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అయితే మైదుకూరు నుండి  తానే బరిలో ఉంటానని పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు.

ఈ  పరిణామాల నేపథ్యంలో ఇండిపెండెంట్‌గా కూడ బరిలోకి దిగాలని డీఎల్ ప్లాన్ చేసుకొన్నారు. అయితే ఈ తరుణంలో  డీఎల్ రవీంద్రారెడ్డి గురువారం నాడు జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. మైదుకూరు నుండి  వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కొనసాగుతున్నారు.రఘురామిరెడ్డికి బదులుగా డీఎల్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తారా లేదా ఎమ్మెల్సీని ఇస్తారా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. 

click me!