ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్.. ఆదేశాలు జారీ చేసిన ఈసీ

Siva Kodati |  
Published : Mar 31, 2019, 10:30 AM IST
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్.. ఆదేశాలు జారీ చేసిన ఈసీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విశ్వజిత్ 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు.

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారంటూ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వైసీపీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ వారిపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు