ఇద్దరు మిత్రులే: నర్సరావుపేట బరిలో డాక్టర్ల మధ్య పోటీ

By narsimha lodeFirst Published Mar 31, 2019, 1:26 PM IST
Highlights

ఇద్దరు మిత్రులే. పేరు మోసిన డాక్టర్లు. కలిసి పలు శస్త్రచికిత్సలు చేశారు. కానీ, రాజకీయ రంగంలో వీరిద్దరూ ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారారు. నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ కూడ డాక్టర్లే.

నర్సరావుపేట: ఇద్దరు మిత్రులే. పేరు మోసిన డాక్టర్లు. కలిసి పలు శస్త్రచికిత్సలు చేశారు. కానీ, రాజకీయ రంగంలో వీరిద్దరూ ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారారు. నర్సరావుపేట అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ, వైసీపీ అభ్యర్థులిద్దరూ కూడ డాక్టర్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా మరోసారి పోటీకి దిగుతున్నారు.  టీడీపీ తరపున డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు బరిలోకి దిగుతున్నారు.

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీల నుంచి పోటీచేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఎముకల శస్త్ర వైద్య నిపుణులు. ఒకనాడు మంచి మిత్రులు. వందల సంఖ్యలో ఆపరేషన్‌లు నిర్వహించారు. డాక్టర్లుగా మంచి గుర్తింపు పొందారు. ఈ స్థానం నుండి ఈ దఫా టీడీపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన చదలవాడ అరవింద్ బాబును బరిలోకి దింపింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి 16650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ ఎంపీ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డికి 6690 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.

రొంపిచర్ల మండలంలో వైసీపీకి ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని టీడీపీ అభిప్రాయంతో ఉంది. వైసీపీ ఆధిక్యతను తగ్గించేందుకు పావులు కదుపుతోంది.నర్సరావుపేట మండలం, నర్సరావుపేట మున్సిపాలిటిలో రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.నర్సరావుపేట మున్సిపాలిటీలో ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారో ఆ పార్టీ అభ్యర్ధికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

click me!