పవన్ కల్యాణ్ కు సిపిఐ ఝలక్: అలయెన్స్ బ్రేక్

Published : Mar 24, 2019, 08:26 AM IST
పవన్ కల్యాణ్ కు సిపిఐ ఝలక్: అలయెన్స్ బ్రేక్

సారాంశం

పొత్తులో భాగంగా తమకిచ్చిన విజయవాడలో తమ అభ్యర్థిగా చలసాని అజయ్‌కుమార్‌ పేరును సీపీఐ సెంట్రల్‌ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. సోమవారం నామినేషన్‌ దాఖలుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాదబాబు పేరును ప్రకటించింది. 

అమరావతి: వామపక్షాలతో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పొత్తుకు బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి.  పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్‌సభ స్థానానికి జనసేన తన అభ్యర్థిని ప్రకటించింది. దాంత్ సిపిఐ పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తుతోంది.

పొత్తులో భాగంగా తమకిచ్చిన విజయవాడలో తమ అభ్యర్థిగా చలసాని అజయ్‌కుమార్‌ పేరును సీపీఐ సెంట్రల్‌ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. సోమవారం నామినేషన్‌ దాఖలుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాదబాబు పేరును ప్రకటించింది. దాంతో సీపీఐ నేతలు బిత్తరపోయారు. 

శనివారం సాయంత్రం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు అత్యవసరంగా సమావేశమై దీనిపై చర్చించింది. ఇదే సమయంలో శనివారం విజయవాడలో రెండు చోట్ల బహిరంగ సభల్లో పవన్‌ స్వయంగా పాల్గొన్నారు. ఆ సభలకు సిపిఐ నేతలు దూరంగా ఉన్నారు.
 
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తమకు కేటాయించాలని సిపిఐ నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చల సందర్భంగా పట్టుబట్టారు. అయితే చివరి నిమిషంలో జనసేన అభ్యర్థినే నిలబెట్టాలని పవన్‌ నిర్ణయించుకున్నారు. దాని బదులు సీపీఐకి నూజివీడు సీటిచ్చారు. దాంతో ఆ పార్టీ అక్కడ తన అభ్యర్థిగా అక్కినేని వనజ పేరు ప్రకటించింది. 

ఆ తర్వాత ఆ స్థానాన్ని కూడా జనసేన వెనక్కి తీసుకుంది. దీనికి బదులు విజయవాడ పార్లమెంటు స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. ఇప్పుడు దాన్ని కూడా వెనక్కి తీసుకోవడంతో సీపీఐ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర కమిటీలోని కీలక నేతలంతా ఒంటరి పోరే మంచిదని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు