జనసేన మిత్రపక్షం సీపీఐ అభ్యర్థుల ప్రకటన: టికెట్లు దక్కించుకున్న వారు వీరే....

Published : Mar 18, 2019, 08:36 PM IST
జనసేన మిత్రపక్షం సీపీఐ అభ్యర్థుల ప్రకటన: టికెట్లు దక్కించుకున్న వారు వీరే....

సారాంశం

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన సీపీఐ పార్టీ సోమవారం సాయంత్రం ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులను ప్రకటించే పనిలో పడింది సీపీఐ పార్టీ. జనసేన పార్టీతో పొత్తులో భాగంగా సీపీఐ ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించింది జనసేన పార్టీ. 

అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన సీపీఐ పార్టీ సోమవారం సాయంత్రం ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. 

మిగిలిన నూజీవీడు అసెంబ్లీతోపాటు రెండు పార్లమెంట్ స్థానాలను మంగళవారం ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇకపోతే పొత్తులో భాగంగా కడప, అనంతపురం లోక్ సభ స్థానాలు సీపీఐకి కేటాయించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 

సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థులు
1. పాలకొండ (ఎస్టీ) - డా.డీవీజీ శంకరరావు
2. ఎస్‌.కోట - పి. కామేశ్వరరావు
3. విశాఖ పశ్చిమ - జేవీ సత్యనారాయణమూర్తి
4. మంగళగిరి - ముప్పాళ్ల నాగేశ్వరరావు
5. కనిగిరి - ఎం.ఎల్‌.నారాయణ
6. డోన్‌ - కె.రామాంజనేయులు

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు