జగన్, పవన్ లపై చంద్రబాబు తీవ్ర విమర్శలు

By Nagaraju penumalaFirst Published Mar 25, 2019, 5:06 PM IST
Highlights

చిత్తూరు జిల్లా సత్యవేడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు లోకమంతా తన అభివృద్ధి గురించి చర్చించుకుంటే జగన్‌, పవన్‌కు అభివృద్ధి కనిపించట్లేదా అని ప్రశ్నించారు.పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతామని, తొందర్లోనే 3వ విడత పసుపు-కుంకుమ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తనపై విమర్శలు చేస్తున్న జగన్, పవన్ లకు అభివృద్ధి కనిపించడం లేదా అని నిలదీశారు. 

చిత్తూరు జిల్లా సత్యవేడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు లోకమంతా తన అభివృద్ధి గురించి చర్చించుకుంటే జగన్‌, పవన్‌కు అభివృద్ధి కనిపించట్లేదా అని ప్రశ్నించారు.

పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతామని, తొందర్లోనే 3వ విడత పసుపు-కుంకుమ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతి, చెన్నై, నెల్లూరు కలుపుతూ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు. 

జాబు రావాలంటే బాబు ఉండాలని ప్రజలు, నిరుద్యోగ యువత కోరుకుంటున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్‌పై 11 సీబీఐ కేసులు, ఏడు ఈడీ కేసులు ఉన్నాయని తెలిపారు. కుప్పం కంటే సత్యవేడులో భారీ మెజార్టీ రావాలని చంద్రబాబు కోరారు.  

click me!