‘ ఎన్నికల ఫలితాల తర్వాత రెండుగా విడిపోనున్న టీడీపీ’

By telugu teamFirst Published May 21, 2019, 2:21 PM IST
Highlights

ఈ నెల 23 తర్వాత రాష్ట్రంలో టీడీపీ రెండు ముక్కలు అవుతుందని బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


ఈ నెల 23 తర్వాత రాష్ట్రంలో టీడీపీ రెండు ముక్కలు అవుతుందని బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు పార్టీ రెండు ముక్కలుగా విడిపోతుందని చెప్పారు.

నిజమైన టీడీపీ కార్యకర్తలంతా తిరుగుబాటు చేయాలని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. నారావారి పార్టీ, నందమూరి వారి పార్టీ పేరిట రెండు ముక్కలుగా చీలిపోతుందని  చెప్పారు. రాష్ట్రంలో సైకిల్ టైరులో గాలిలేదని, ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో స్థానం లేదు కాబట్టే జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

వైసీపీ గెలవడానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. జనసేన.. టీడీపీ ఓట్లు చీల్చిందని అభిప్రాయపడ్డారు. ప్రజాశాంతి పార్టీ పేరుతో రాయలసీమలో చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు ధోరణి దొంగే దొంగా అన్నట్టు ఉందని, డేటా చోరి కేసులో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.

 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబును ఎన్నికల సంఘం విచారించాలని డిమాండ్‌ చేశారు. వైఎసీపీ, బీజేపీ కలిసిపోయాయంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొందని.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మాధవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.
 

click me!