లక్షల కోట్ల ఆక్రమార్జనకు క్విడ్ ప్రోకో కనిపెట్టిన జగన్: లోకేష్ ట్వీట్

Published : Mar 14, 2019, 11:22 AM IST
లక్షల కోట్ల ఆక్రమార్జనకు క్విడ్ ప్రోకో కనిపెట్టిన జగన్: లోకేష్ ట్వీట్

సారాంశం

లక్షల కోట్ల అక్రమార్జనకూ క్విడ్ ప్రోకో కనిపెట్టిన జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. క్విడ్ ప్రోకో కేసుల నుంచి బయటపడేందుకు మోడీ గారితో కలిసి పొలిటికల్ క్విడ్ ప్రో కోకి దిగారని ఆరోపించారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి నారా లోకేష్. లక్షల కోట్ల అక్రమార్జనకూ క్విడ్ ప్రోకో కనిపెట్టిన జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. 

క్విడ్ ప్రోకో కేసుల నుంచి బయటపడేందుకు మోడీ గారితో కలిసి పొలిటికల్ క్విడ్ ప్రో కోకి దిగారని ఆరోపించారు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీపైనా సెటైర్లు వేశారు. అంతేకాదు టైమ్స్ నౌ కలువకుంట కుట్రలిప్పేసింది అంటూ కేసీఆర్ పై సెటైర్లు కూడా వేశారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం కలిసిన ఫోటోను పోస్ట్ చేస్తూ జగన్ మోడీ జోడీల క్విడ్ ప్రోకో అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. 
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు