న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్న చంద్రబాబు...

By Arun Kumar PFirst Published Mar 23, 2019, 12:18 PM IST
Highlights

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి స్థానికంగా ఎన్నికల కమీషన్ చేత నియమింపబడిన రిట్ర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేయాలి. ఆ తర్వాత సదరు అభ్యర్థి చేత రిటర్నింగ్ అధికారి ప్రతిజ్ఞ చేయిస్తారు.

అయితే స్వయంగా అభ్యర్థి నామినేషన్ వేయలేని పరిస్థితుల్లో ఆయన తరపున వేరే వాళ్లు ఆ పత్రాలను రిట్ర్నింగ్ అధికారిని సమర్పించవచ్చు. కానీ అభ్యర్థి మాత్రం ప్రతిజ్ఞ చేయాల్సివుంటుంది. ఇలా నామినేషన్ వేసిన కొద్ది రోజుల్లోనే నేరుగా రిటర్నింగ్ అధికారం వద్దగానీ, ఎవరైనా న్యాయమూర్తి వద్ద గానీ పోటీ చేసే అభ్యర్ధి ప్రతిజ్ఞ చేయవచ్చు. 

 ఇలా ఎన్నికల హడావిడి కారణంగా చంద్రబాబు తాను పోటీ చేసే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో స్వయంగా నామినేషన్ వేయలేకపోయారు.  ఆయన తరపున స్థానిక టిడిపి నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. దీంతో రిటర్నింగ్ అధికారి ముందు కాకుండా చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట హజరై ప్రతిజ్ఞ చేయనున్నారు.     

click me!