ఏపీ ప్రత్యేకహోదాపై కేసీఆర్ ప్రకటనకు చంద్రబాబు కౌంటర్

By Siva KodatiFirst Published Apr 9, 2019, 1:56 PM IST
Highlights

ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ స్టేషన్లకు రావాలని లేదంటే ఓట్ల దొంగలు , మిషన్ దొంగలు కాచుకుని ఉన్నారని మీ ఓట్లు గల్లంతైపోతాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ స్టేషన్లకు రావాలని లేదంటే ఓట్ల దొంగలు , మిషన్ దొంగలు కాచుకుని ఉన్నారని మీ ఓట్లు గల్లంతైపోతాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా గురజాలలో జరిగిన ప్రచార సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

కేసీఆర్ మీ ముఖ్యమంత్రిని సన్నాసి అని అంటున్నాడని డ్వాక్రా మహిళలను తాను ఆదుకుంటే కేసీఆర్ తెలంగాణలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఎవరు సన్నాసి అని చంద్రబాబు ప్రశ్నించారు.

మన ఉలవచారని వాళ్ల పశువులు తింటాయట, మన బిర్యాన్నీ పేడ బిర్యానీ అంటూ కేసీఆర్ పేలుతున్నారని బాబు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానన్న కేసీఆర్.. సోనియా గాంధీని రాక్షసి అన్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్, జగన్‌‌లు నరేంద్రమోడీ పెంపుడు కుక్కలని చంద్రబాబు ఆరోపించారు. ఆయన ఒక బిస్కెట్ ఇస్తే వీళ్లద్దరూ తోక ఊపుకుంటూ మోడీ చుట్టూ తిరుగుతారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో మోడీ గెలిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలు ఉండవని.. ఆయన ఎవరు చెబితే వారే పాలకులు అవుతారని చంద్రబాబు ఆరోపించారు.

హోదాకు మద్ధతిస్తానన్న కేసీఆర్ మాటలను నమ్మడానికి లేదని, మాటలు మార్చడంలో ఆయన సిద్ధహస్తుడని సీఎం స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనని కార్యకర్తలపైనా, అధికారులపైనా అసంతృప్తిగా ఉంటే తనను చూసి ఓటేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. 
 

click me!