టీడీపీలో టికెట్ కన్ఫామ్.. కానీ వైసీపీలోకి ఆదాల?

Published : Mar 16, 2019, 09:53 AM IST
టీడీపీలో టికెట్ కన్ఫామ్.. కానీ వైసీపీలోకి ఆదాల?

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అధికార టీడీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అధికార టీడీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు చేరేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటి వరకు పార్టీ మారిన వారంతా.. టికెట్ దక్కలేదని పార్టీని వీడారు. ఆదాల విషయంలో మాత్రం ఇది పూర్తిగా విభిన్నం.

విచిత్రం ఏమిటంటే.. ఆదాలకు టీడీపీలో టికెట్ కన్ఫామ్ అయినప్పటికీ.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు రెండు రోజుల కిందటే నెల్లూరు రూరల్ టీడీపీ టిక్కెట్ కన్ఫామ్ అయింది. అయితే ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో మాట్లాడిన ఆదాల ఇవాళ జగన్ ను కలవనున్నట్టు సమాచారం. మరోవైపు ఆయనను ఆపేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆయన ఎవ్వరికి అందుబాటులోకి రాకుండా ఉన్నట్టు సమాచారం.

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు