అంతా చంద్రబాబే: నారా లోకేష్ నామ మాత్రమే

By telugu teamFirst Published Mar 13, 2019, 12:08 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉన్న స్థితిలో నారా లోకేష్ కు నిర్ణయాలు చేసే బాధ్యతను అప్పగిస్తే బెడిసికొడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 

అమరావతి: చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులో ఆయనే అంతా అయి ఖరారు చేస్తున్నారు. తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ఇందులో ఏ విధమైన పాత్ర లేదని తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉన్న స్థితిలో నారా లోకేష్ కు నిర్ణయాలు చేసే బాధ్యతను అప్పగిస్తే బెడిసికొడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 

నిజానికి, చంద్రబాబు వారసుడిగా ఈ ఎన్నికల్లో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తారని అందరూ భావించారు. కొన్నాళ్ల క్రితం లోకేష్ పర్యటనలను గమనిస్తే అలాగే అనిపించింది. అకస్మాత్తుగా ఆయన బయటకు కనిపించడం మానేశారు. చంద్రబాబుకు ఆయనపై పూర్తి నమ్మకం కుదరకపోవడం వల్లనే అలా జరిగిందని చెప్పవచ్చు. 

తెలంగాణలో హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల్లో నారా లోకేష్ అంతా తానై వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో అభ్యర్థుల ఎంపికలో గానీ వ్యూహరచనలో గానీ నారా లోకేష్ పాత్రను ఈ ఎన్నికల్లో పూర్తిగా తగ్గించినట్లు చెబుతున్నారు. 

కె. నిశాంత్

click me!