ఏపీకి మోదీ, ఢిల్లీకి వైఎస్ జగన్

By Nagaraju penumalaFirst Published Feb 28, 2019, 9:19 AM IST
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టిసారించారు. దీంతో గురువారం వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తుకు నిర్ణయం తీసుకునేలా సమావేశం ఉంటుందని తెలుస్తోంది. 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే ఇండియా టుడే సదస్సులో జగన్ పాల్గొననున్నారు. అందులో భాగంగా వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టిసారించారు. దీంతో గురువారం వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తుకు నిర్ణయం తీసుకునేలా సమావేశం ఉంటుందని తెలుస్తోంది. 

అలాగే రాబోయే ఎన్నికల్లో పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే అదే రోజు మార్చి 1న భారత ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు మోదీ ఏపీ రానున్నారు. మెుత్తానికి అటు ఢిల్లీకి జగన్ వెళ్తే, ఇటు ఏపీకి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు.  
 
click me!