అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి: వైఎస్ జగన్ ఆకాంక్ష

By Nagaraju penumalaFirst Published Feb 28, 2019, 8:33 AM IST
Highlights

ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోధైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు. ఇకపోతే బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. 

హైదరాబాద్‌ :పాక్ యుద్ధ విమానాలను వెనక్కి తిప్పికొడుతున్న సమయంలో పాక్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ విక్రమ్‌ అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. 

ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి మనోధైర్యాన్నిఇవ్వాలని కోరారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని ఆ భగవంతుడ్ని ప్రారిస్తున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు. ఇకపోతే బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. 

భారత వైమానిక దళాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆ సమయంలో భారత పైలట్‌ అభినందన్‌ ఉన్న మిగ్ 21న విమానం పాకిస్థాన్ లో కుప్పకూలిపోయింది. దీంతో విక్రమ్ అభినందన్ పాక్‌ సైన్యానికి చిక్కారు. 

ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్‌ ఓ విడియోను విడుదల చేసింది. ప్రస్తుతం పైలెట్‌ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. భారత పైలట్‌ ఒకరు పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కారని భారత్‌ కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. 

My prayers for the safety and quick return of IAF Wing Commander Abhinandan. May God give him and his family, strength and courage at this trying time.

— YS Jagan Mohan Reddy (@ysjagan)

click me!