ఏ పార్టీతో పోటీ లేదు: వైసీపీ మేనిఫెస్టోపై జగన్

By narsimha lodeFirst Published Mar 6, 2019, 1:50 PM IST
Highlights

కౌలు రైతులకు న్యాయం చేసేలా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో  కౌలు రైతాంగం కోసం చేపట్టాల్సిన చర్యలను చేర్చాలని ఆయన మేనిఫెస్టో కమిటీకి సూచించారు..

హైదరాబాద్:  కౌలు రైతులకు న్యాయం చేసేలా పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  అభిప్రాయపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో  కౌలు రైతాంగం కోసం చేపట్టాల్సిన చర్యలను చేర్చాలని ఆయన మేనిఫెస్టో కమిటీకి సూచించారు..

వైసీపీ మేనిఫెస్టో కమిటీ బుధవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమైంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలపై  ఈ సమావేశంలో చర్చించారు. అమలు చేయగలిగిన వాగ్ధానాలనే మేనిఫెస్టోలో చేర్చాలని జగన్ సూచించారు.

అమలుకు, ఆచరణ యోగ్యం కానీ  వాగ్దానాల విషయమై దూరంగా ఉండాలని  జగన్ కమిటీకి సూచించారు. కౌలు రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోనేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని కూడ ఆయన ఏర్పాటు చేశారు. 

వాగ్దానాలను ఇవ్వడంలో ఏ పార్టీతోనూ పోటీ పడకూడదని ఆయన మేనిఫెస్టో కమిటీకి సూచించారు.  మేనిఫెస్టో సంక్షిప్తంగాను, అందరికీ అర్ధమయ్యేలా ఉండాలని  జగన్ కోరారు.  కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని కమిటీ దృష్టికి జగన్ తీసుకొచ్చారు.

click me!