స్థలం కోసం: మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టి, చిత్రహింసలు

By Siva KodatiFirst Published Feb 27, 2019, 8:19 AM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. స్థలం వివాదంలో బంధువులు ఒక మహిళపై పైశాచికంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. బిక్కవోలు దళిత కాలనీకి చెందిన సల్మాన్ రాజు విశాఖ ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. స్థలం వివాదంలో బంధువులు ఒక మహిళపై పైశాచికంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. బిక్కవోలు దళిత కాలనీకి చెందిన సల్మాన్ రాజు విశాఖ ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతనికి వరుసకు మరదలయ్యే నిడగంట్ల మంగవేణి తన ఇంటి పక్కనే నివసిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా భూమికి సంబంధించిన సరిహద్దు వివాదముంది. ఈ వ్యవహారంపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది.

ఈ క్రమంలో సోమవారం మంచినీటి కుళాయి విషయంలో మరోసారి సల్మాన్‌రాజుకు, మంగవేణికి ఘర్షణ జరిగింది. దీంతో సాల్మన్ ‌తో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురు కలిసి మంగవేణిపై దాడి చేశారు.

అంతటితో ఆగకుండా మహిళ అని కూడా చూడకుండా ఆమె బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి, గాయపడేలా కొట్టారు. అనంతరం ఆమె శరీరానికి కారం పూశారు. తల్లిని రక్షించేందుకు వెళ్లిన ఆమె కూతురు 11 ఏళ్ల బాలికను కూడా వివస్త్రను చేసి హింసించారు.

నాలుగు సంవత్సరాలుగా మంచంలో పడివున్న మంగవేణి భర్త రమేశ్ ‌దారుణాన్ని చూస్తున్నా ఏమీ చేయలేకపోయాడు. మంగవేణి కేకలు పెట్టడంతో స్థానికులు వచ్చి రక్షించారు. ఆమె కుమారుడు ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తమకు జరిగిన దారుణంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

click me!