కొడాలి నానితో వంగ వీటి రాధా భేటీ..?

Published : Mar 11, 2019, 09:46 AM IST
కొడాలి నానితో వంగ వీటి రాధా భేటీ..?

సారాంశం

కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు( కొడాలి నాని) నితో వంగవీటి రాధా భేటీ అయ్యారు. 


కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు( కొడాలి నాని) నితో వంగవీటి రాధా భేటీ అయ్యారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని చూస్తున్నారు.  గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. వంగవీటి రాధా మద్దతుతో ఈ ఓట్లు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

కొడాలి నానితో జరిగిన భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అడపా వెంకటరమణ (బాబ్జీ), పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి, కొడాలి నాగేశ్వరరావు (చిన్ని), మాజీ కౌన్సిలర్‌ పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. వంగవీటి రాధా.. వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు.

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు