శ్రీధరణి హత్య: రాజు బాగోతాలు వెలుగులోకి...

By narsimha lodeFirst Published Feb 27, 2019, 12:55 PM IST
Highlights

ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటలే అతడి లక్ష్యం. ఆ జంటల బలహీనతలను రాజు అనే వ్యక్తి సొమ్ము చేసుకొంటున్నాడు. చాలా కాలంగా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు.


ఏలూరు: ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటలే అతడి లక్ష్యం. ఆ జంటల బలహీనతలను రాజు అనే వ్యక్తి సొమ్ము చేసుకొంటున్నాడు. చాలా కాలంగా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు. శ్రీధరణి హత్యతో రాజు భాగోతం వెలుగు చూసింది.

ఈ నెల 24వ తేదీన నవీన్, శ్రీధరణిలు బౌద్ధారామాలయానికి వెళ్లారు. అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఏకాంతం కోసం కూర్చొన్నారు. అయితే అదే సమయంలో  పక్షుల వేట కోసం నిందితుడు రాజు ఆ ప్రాంతానికి వచ్చాడు.  నవీన్‌ వద్దకు వచ్చి డబ్బులను డిమాండ్ చేశాడు.  అయితే నవీన్ మాత్రం ససేమిరా అన్నాడని సమాచారం. దీంతో నవీన్‌పై రాజు తన వెంట తెచ్చుకొన్న కర్రతో దాడికి దిగాడు. దీంతో నవీన్ స్పృహా కోల్పోయాడు.

అక్కడే ఉన్న శ్రీధరణిపై రాజు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు ఆమె ప్రతిఘటించడంతో రాయితో ఆమె తలపై బాది హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. 

ద్వారకా తిరుమల మండలంలోని జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని రాజు వివాహం చేసుకొన్నాడు. అప్పటి నుండి ఇదే ప్రాంతంలోని ఓ జీడి మామిడి తోటకు కాపలాగా ఉంటున్నాడు. అక్కడే భార్యతో కలిసి ఆయన కాపురం ఉంటున్నాడు.

కృష్ణా జిల్లాకు చెందిన రాజు నూజివీడులోని ఓ మామిడితోటకు కాపలాగా గతంలో ఉండేవాడు. ఆ సమయంలో కూడ ఈ ప్రాంతంలో ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటల నుండి  భారీగా డబ్బులను గుంజేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే తరహాలోనే ఇక్కడ కూడ డబ్బులను వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా తిరుగుతూ పక్షులు, జంతువులను వేటాడుతున్నట్టుగా రాజు కుటుంబస్యులకు చెప్పారు.  అయితే పర్యాటక ప్రదేశాలకు వచ్చే ప్రేమ జంటలను, పర్యాటకులను బెదిరించి డబ్బులు వసూలు చేయడాన్ని రాజు వృత్తిగా ఎంచుకొన్నాడు. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే వారిపై దాడి చేస్తున్నారు. 

ఏకాంతం కోసం వచ్చే ప్రేమికులు రాజు విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. ఈ విషయాన్ని బయటకు చెబితే ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. ఈ కారణంగానే ఇంతకాలం పాటు రాజు చేసిన దారుణాలు వెలుగు చూడలేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీధరణి హత్యకేసులో ట్విస్ట్: రాజు ఆచూకీ ఇలా దొరికింది

 

click me!