టీడీపీలోకి సాఫ్ట్ వేర్ ఇంజినీర్

By ramya NFirst Published Mar 6, 2019, 11:11 AM IST
Highlights

చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో.. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కఈషి చేస్తానని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తిరువీధుల శ్రీనివాసరావు చెప్పారు.

చంద్రబాబు మీద ఉన్న అభిమానంతో.. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కఈషి చేస్తానని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తిరువీధుల శ్రీనివాసరావు చెప్పారు.

తెనాలికి చెందిన శ్రీనివాసరావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా కొనసాగుతూ వచ్చానని, ఇకపై పూర్తిస్థాయిలో ప్రజాజీవితం గడపాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుగుతున్నట్టు ఆయన చెప్పారు. 

స్వతహాగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన తనను ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాఫ్ట్‌వేర్‌ రంగం బలోపేతానికి చేసిన కృషి అమితంగా ఆకట్టుకుందని, ఆనాటి నుంచి చంద్రబాబుకు అభిమానిగా మారిపోయానని చెప్పారు. 

పేద, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు.

ఇకపై తాను మంగళగిరి ప్రజలకు అందుబాటులో వుండి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సేవలు అందిస్తానని తెలిపారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే సంకల్పంతో తాను టీడీపీలో చేరుతున్నానే తప్ప... టిక్కెట్టు ఆశించో, గ్రూపులు కట్టడానికో రావడంలేదని ఆయన స్పష్టంచేశారు. తన అనుచరులు, మద్దతు దారులతో కలిసి.. బుధవారం సీఎం నివాసానికి వెళ్లి.. అక్కడ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు. 

click me!