విశాఖ రైల్వేజోన్‌పై దీక్షను విరమించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

Published : Mar 06, 2019, 10:44 AM IST
విశాఖ రైల్వేజోన్‌పై  దీక్షను విరమించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

సారాంశం

వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వే‌జోన్‌లో కలపాలంటూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు 15 గంటల పాటు దీక్షను విద్యార్ధినులు విరమింపజేశారు.  


శ్రీకాకుళం: వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వే‌జోన్‌లో కలపాలంటూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు 15 గంటల పాటు దీక్షను విద్యార్ధినులు విరమింపజేశారు.

మంగళవారం సాయంత్రం రామ్మోహన్ నాయుడు  దీక్షను ప్రారంభించారు. బుధవారం నాడు ఉదయం 9 గంటలకు దీక్షను విరమించారు.వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. 

శ్రీకాకుళం జిల్లాలోని  పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఏడు రైల్వే స్టేషన్లను కుర్ధా డివిజన్‌ నుండి తప్పించాలని  రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.  ఈ ఏడు రైల్వేస్టేషన్లను విశాఖ డివిజన్‌లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం నాడు ఉదయం 9 గంటలకు స్కూల్ విద్యార్థినులు నిమ్మరసం ఇవ్వడంతో  రామ్మోహన్ నాయుడు దీక్షను విరమించారు. రైల్వేజోన్ ఇచ్చిన సంతోషం తమకు లేదని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం