షాకిచ్చిన జగన్: అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే ఆళ్ల, కార్యకర్తల ఆందోళన

By telugu teamFirst Published Mar 2, 2019, 1:36 PM IST
Highlights

ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని వారు చెబుతున్నారు.

గుంటూరు: మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి సీటు వదులుకోవాలని ఆయన ఆళ్లకు సూచించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని వారు చెబుతున్నారు. రాజీనామా లేఖలను సిద్ధం చేసుకుని వారు ఆళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. తాడేపల్లిలోని 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. 

ఆర్కేకు సీటు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కె) అనుచురులు జగన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలిద్దామని చెప్పి ఆయన వారిని వెనక్కి పంపించేశారు. ఈ స్థితిలో శుక్రవారం ఆర్కేను తన వద్దకు పిలిపించుకొని పద్మశాలీలకు రాష్ట్రంలో ఒక్క సీటైనా ఇవ్వలేకపోతున్నామని, నువ్వు త్యాగం చేస్తే ఈ సీటును వారికి ఇద్దామని జగన్ చెప్పారు. 

ఏం చెప్పాలో తెలియక ఆళ్ల రామకృష్ణా రెడ్డి వెనుదిరిగినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన ఎవరికీ కనిపించడం లేదని అంటున్నారు.  ఏమాత్రం పార్టీకి పట్టులేని స్వగ్రామమైన పెదకాకాని గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోకి ఏకంగా తన తల్లినే బరిలోకి దించి ఎంతో వ్యయ ప్రయాసలతో ఆమెను గెలిపించుకున్న విషయం జగన్‌కు గుర్తులేదా వారు ప్రశ్నిస్తున్నారు.

click me!