పవన్ రెడీ.. 32మందితో జనసేన తొలిజాబితా

Published : Mar 11, 2019, 04:23 PM IST
పవన్ రెడీ.. 32మందితో జనసేన తొలిజాబితా

సారాంశం

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీంతో..ఈ ఎన్నికలకు మేము కూడా రెడీ గా ఉన్నామంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీంతో..ఈ ఎన్నికలకు మేము కూడా రెడీ గా ఉన్నామంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అభ్యర్థుల జాబితా కూడా రెడీ చేసినట్లు ప్రకటించింది. తొలి విడత జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. 

ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఇందులో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఈ వచ్చే ఎన్నికల్లో జనసేన వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. అభ్యర్థుల విషయంలో వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమకు 26 శాసనసభ, 4 లోకసభ స్థానాలను కేటాయించాలని వామపక్షాలు జనసేన  అధినేతను కోరుతున్నట్లు తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet