బెదిరించి..వైసీపీలోకి చేర్చుతున్నారు..కేసీఆర్ కి కళా లేఖ

Published : Mar 11, 2019, 03:12 PM IST
బెదిరించి..వైసీపీలోకి చేర్చుతున్నారు..కేసీఆర్ కి కళా లేఖ

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. 


తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. ఏపీలో జగన్ కి అధికారం కట్టబెట్టేందుకు కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కళా వెంకట్రావు సోమవారం.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు. జగన్‌ను నమ్మి ప్రజలు ఓటేస్తారని, రాష్ట్రంపై పెత్తనం వస్తుందని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని నిప్పులు చెరిగారు. ఏప్రిల్ 11న ఎన్నికలు రావడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 

హైదరాబాద్‌లో వ్యాపారాలున్న టీడీపీ నేతలు వైసీపీలో చేరడం వెనుక కేసీఆర్ బెదిరింపులు లేవా? అని లేఖలో ప్రశ్నించారు. ‘టీడీపీని ఎదుర్కొనే సత్తా లేక జగన్‌ మీ మద్దతు కోరడం.. మీరు రూ.2 వేల కోట్లు పంపడం వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు.

 తెలంగాణ ఎన్నికల్లో వాడిన ఓట్ల తొలగింపు స్ట్రాటజీనే ఏపీలో కూడా జగన్‌తో అమలు చేయిస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet