విశాఖలో టీడీపీకి విద్యుత్ శాఖ షాక్..

Published : Feb 27, 2019, 10:07 AM IST
విశాఖలో టీడీపీకి విద్యుత్ శాఖ షాక్..

సారాంశం

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి విద్యుత్‌ శాఖ షాక్‌ ఇచ్చింది. 

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి విద్యుత్‌ శాఖ షాక్‌ ఇచ్చింది. కార్యాలయానికి సంబంధించిన బిల్లు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మంగళవారం ఫ్యూజులు తొలగించి సరఫరా నిలిపివేసింది. టీడీపీ కార్యాలయం సుమారు రూ.4.8 లక్షల మేర విద్యుత్‌ శాఖకు బకాయిపడింది

. గతంలో పార్టీ కార్యాలయ వ్యవహారాలను సీనియర్‌ నేత ఎంవీవీఎస్‌ మూర్తి చూసుకునేవారు. ప్రతి నెలా రూ.80 వేల వరకూ బిల్లు వచ్చేది. ఆయనే చెల్లించేవారు. ఆయన మరణానంతరం ఈ బిల్లులు చెల్లించేందుకు ఎవరూ శ్రద్ధ చూపకపోవడంతో బకాయిలు పేరుకుపోయి ఈ పరిస్థితి తలెత్తింది.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్