ప్రియురాలి చెల్లితోనే పెళ్లి: కలిసి బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

Published : Mar 02, 2019, 01:36 PM IST
ప్రియురాలి చెల్లితోనే పెళ్లి: కలిసి బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

సారాంశం

వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ సమీప బంధువులే అవడంతో తమ ప్రేమకు ఏ అడ్డంకి వుండదనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు మాత్రం వీరి ప్రేమను వ్యతిరేకించి పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇక ఎలాగూ కలిసి  బ్రతకలేము...కలిసైనా  చద్దామని అనుకున్నారో ఏమో రైలు కింద  పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుుకుంది.   

వివరాల్లోకి వెళితే... వెంకటాచలం మండలం గొట్లపాళెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు  తన సమీప బంధువు కామాక్షి గతకొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  ప్రేమికులిద్దరు బంధువులే...పైగా వరస కూడా కుదిరింది. దీంతో పెళ్లి చేసుకోవాలని  భావించారు. అయితే వీరి ప్రేమ విషయం తెలిసిన వెంకటేశ్వర్లు  తల్లిదండ్రులు కొడుకును మందలించారు. యువతి కుటుంబ సభ్యులు భారీగా కట్నం ఇచ్చుకోలేరని తెలిసి వీరి పెళ్ళికి యువకుడి కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. 

అంతటితో ఆగకుండా కామాక్షి వాళ్ల బాబాయి కూతురుకే  ఇచ్చి వెంకటేశ్వర్లుకు బలవంతంగా వివాహం చేశారు. దీంతో ఇక తామిద్దరం కలిసి బ్రతికే అవకాశాలే లేవని భావించిన ప్రేమజంట కలిసి చావాలని నిర్ణయించుకున్నారు. దీంతో  వెంకటేశ్వర్లు, కామాక్షి ఇద్దరు కలిసి వెంకటాచలం రైల్వే గేట్ సమీపంలో రైలు  కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా పెద్దలు చేసిన తప్పుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడమే కాదు మరో యువతి చిన్న  వయసులోనే భర్తను కోల్పోయింది. 

రైలు పట్టాలను మృతదేహాలను గుర్తించిన రైల్వే పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తుమ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై శివరాజ్ సింగ్ పొగడ్తలు | Shivraj Singh Speech | Asianet Telugu
బుర్రిపాలెంని ఉర్రుతలూగించిన బాబు ఉరమాస్ స్పీచ్ | Chandrababu Buripalem Speech | Asianet Telugu