హైకోర్టులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట

By Nagaraju penumalaFirst Published Mar 14, 2019, 9:13 AM IST
Highlights

2014 ఏప్రిల్‌ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారమై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని దిగువ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. 

అమరావతి: మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా న్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ చిరంజీవిపై  గుంటూరు అరండల్‌పేట్‌ పీఎస్ లో కేసు నమోదైంది. 

ఆ కేసును హైకోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2014 ఏప్రిల్‌ 27 రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారంటూ చిరంజీవిపై అధికారులు కేసు నమోదు చేశారు. 

ఈ వ్యవహారమై దాఖలు చేసిన అభియోగపత్రాన్ని దిగువ కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

అక్రమంగా పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఆ వివరాలను పరిగణలోకి తీసుకుని చరింజీవిపై నమోదు చేసిన కేసును రద్దు చేశారు. 

click me!