టీడీపీ 18 లక్షల ఓట్లను తొలగించింది: జీవీఎల్

By Siva KodatiFirst Published Mar 8, 2019, 12:58 PM IST
Highlights

ఎలక్ట్రోల్ రోల్స్‌పై ఎవరి పేరైనా నమోదై లేని పక్షంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు వారు తమ పేరుని చేర్పించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు

ఎలక్ట్రోల్ రోల్స్‌పై ఎవరి పేరైనా నమోదై లేని పక్షంలో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు వారు తమ పేరుని చేర్పించుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

డేటా లీక్ వ్యవహారంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరి పేరుతో అయితే తప్పుడు సమాచారంతో ఓటర్ల లిస్టులో ఉంటే వారిని తప్పించడానికి కూడా అవకాశం ఉండాలని జీవీఎల్ కోరారు.

Latest Videos

తెలుగుదేశం పార్టీ పెద్ద సంఖ్యలో సుమారు 18 లక్షల ఓట్లను తొలగించడం జరిగిందని.. దాదాపు అప్పుడే 20 లక్షల కొత్త ఓట్లు అప్పుడే చేర్చారని ఆయన తెలిపారు. ఇవన్నీ డుప్లికేట్ పేర్లని.. కాబట్టి తప్పుడు ఒట్లను తొలగించేందుకు కూడా అవకాశం ఉండాలని జీవీఎల్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారి వ్యవహారంపై దృష్టిపెట్టాలని జీవీఎల్ స్పష్టం చేశారు. ఫామ్-7ను ఎవరైనా దరఖాస్తు చేయవచ్చని జీవీఎల్ తెలిపారు. 
 

click me!