మోదుగులకు గల్లా జయదేవ్ సవాల్

Published : Mar 07, 2019, 03:44 PM IST
మోదుగులకు గల్లా జయదేవ్ సవాల్

సారాంశం

తనపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవాలని  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  డిమాండ్ చేశారు.

అమరావతి: తనపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవాలని  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  డిమాండ్ చేశారు.

గురువారం నాడు ఆయన గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుండి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి  తనకు గౌరవం ఇచ్చేవాడు కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడ తన పేరును ప్రస్తావించేవాడు కాదని ఆయన గుర్తు చేశారు.

గుంటూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా మోదుగుల పోటీ చేస్తే నా సత్తా ఏమిటో చూపిస్తానని గల్లా జయదేవ్ అన్నారు.వైసీపీకి ఓటేస్తే  మోడీకి ఓటేసినట్టేనని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు.  రెండు రోజుల క్రితం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి  టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP