చంద్రబాబుకు ఆ ఖర్మ పట్టలేదు : కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

Published : Feb 27, 2019, 06:47 PM IST
చంద్రబాబుకు ఆ ఖర్మ పట్టలేదు : కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

సారాంశం

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తోందని చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరతామని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కర్నూలు: కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబును కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వాలని కోరేందుకే కలిసినట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టులు ఇస్తేనే తెలుగుదేశం పార్టీలో చేరతామని చెప్పామని చెప్పుకొచ్చారు. 

బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాల్సి రావడం బాధాకరమని అన్నారు. ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే ఉన్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవాలని చాలా ప్రయత్నించామని స్పష్టం చేశారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తప్పుడు జీవోలు ఇవ్వాల్సిన ఖర్మ పట్టలేదని సైకిలెక్కకుండానే చంద్రబాబును వెనకేసుకొచ్చారు. 

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తోందని చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరతామని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే