కేసీఆర్, కేటీఆర్ లకు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఖాయం: టీడీపీ నేత వెలగపూడి

Published : Feb 27, 2019, 06:10 PM IST
కేసీఆర్, కేటీఆర్ లకు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఖాయం: టీడీపీ నేత వెలగపూడి

సారాంశం

అలాగే మచిలీపట్నం ఎంపీగా కొనకళ్ల నారాయణ మూడోసారి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఈసారి లక్ష మెజారిటీ ఓట్లతో విజయం సాధించబోతున్నారన్నారు. అలాగే పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రెండోసారి గెలుపొందబోతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం సర్దుకోవాల్సిందేనన్నారు.   

విజయవాడ: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుడు వెలగపూడి శంకర్ బాబు చెప్పారు. 

బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమని అలాగే కేసీఆర్, కేటీఆర్ లకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడం తథ్యమన్నారు. 

అలాగే మచిలీపట్నం ఎంపీగా కొనకళ్ల నారాయణ మూడోసారి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఈసారి లక్ష మెజారిటీ ఓట్లతో విజయం సాధించబోతున్నారన్నారు. అలాగే పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రెండోసారి గెలుపొందబోతున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం సర్దుకోవాల్సిందేనన్నారు.  

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu