చంద్రబాబుకు ఝలక్: వైసీపీలోకి జయసుధ

By narsimha lodeFirst Published Mar 7, 2019, 12:03 PM IST
Highlights

 ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరనున్నారు. గురువారం సాయంత్రం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను ఆమె కలవనున్నారు. జగన్ సమక్షంలో జయసుధ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
 

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరనున్నారు. గురువారం సాయంత్రం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను ఆమె కలవనున్నారు. జగన్ సమక్షంలో జయసుధ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జయసుధకు టిక్కెట్టు దక్కడంలో  అప్పటి సీఎం వైఎస్ఆర్ కీలకపాత్ర పోషించారు.

ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం జయసుధ టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆమె కలిశారు. భర్త బతికున్న సమయంలోనే జయసుధ బాబుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరారు. 

ఆ తర్వాత టీడీపీ కార్యక్రమాల్లో ఆమె ఏనాడూ కూడ క్రియాశీలకంగా పాల్గొనలేదు. అయితే గురువారం సాయంత్రం జయసుధ వైసీపీ చీఫ్ జగన్‌తో భేటీ కానున్నారు. జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

click me!