పోటీకి తోట అనాసక్తి: టీడీపీలో సునీల్‌కు లైన్ క్లియర్

By narsimha lodeFirst Published Feb 28, 2019, 6:50 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సునీల్ టీడీపీలో చేరనున్నారు. కొంత కాలం క్రితమే సునీల్ వైసీపీకి గుడ్ బై చెప్పారు

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సునీల్ టీడీపీలో చేరనున్నారు. కొంత కాలం క్రితమే సునీల్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. అదే సమయంలో ఆయన టీడీపీలో చేరుతారని భావించారు. 

 చెలిమలశెట్టి సునీల్ మార్చి1వ తేదీన టీడీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి సునీల్ బాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో సునీల్ పీఆర్పీ అభ్యర్ధిగా  కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  మార్చి1 వ తేదీన సునీల్ టీడీపీలో చేరనున్నారు.

రెండు రోజుల క్రితమే సునీల్ టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిశారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం పోటీ చేయనని బాబుకు చెప్పారు. కానీ, తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుండి పోటీ చేయబోనని చెప్పారు. తనకు కానీ, తన భార్యకు  కానీ జగ్గంపేట సీటు ఇవ్వాలని బాబును నరసింహం కోరారు. 

అయితే తోట నరసింహం పోటీ చేయనని తేల్చి చెప్పడంతో సునీల్ కాకినాడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీకి సై అంటున్నారు. ఇందులో భాగంగానే సునీల్ బాబును కలిశారు. వచ్చే ఎన్నికల్లో సునీల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
 

click me!